Wed Mar 18 2026 03:11:03 GMT+0530 (India Standard Time)
మండే కూడా రష్... ఏమాత్రం తగ్గలేదుగా
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సోమవారం కూడా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సోమవారం కూడా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వీరు స్వామి వారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పట్టే అవకాశముందని తెలిపారు.
12 గంటల సమయం.....
ఇక నిన్న తిరుమల శ్రీవారిని 81,903 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 39,594 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.74 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Next Story

