Mon Mar 16 2026 23:23:24 GMT+0530 (India Standard Time)
శ్రీవారి దర్శనం సులువుగానే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం కూడా భక్తులు అధిక సంఖ్యలోనే తిరుమలకు వస్తున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం కూడా భక్తులు అధిక సంఖ్యలోనే తిరుమలకు వస్తున్నారు. వైకుఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూడకుండానే స్వామి వారిదర్శనం కోసం వెళుతున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సర్వ దర్శనం టోకెన్లు లేకుండా ఈరోజు ఉదయం ఏడు గంటలకు క్యూ లైన్ లో ప్రవేశించే భక్తులకకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Next Story

