Tue Mar 17 2026 13:47:46 GMT+0530 (India Standard Time)
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం దర్శన సమయం పడుతుంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం దర్శన సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఇప్పుడు సర్వదర్శనం క్యూ లైన్ లో వచ్చే వారికి అదనంగా మరో నాలుగు గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక దర్శనం....
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 79,471 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 36,594 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.90 కోట్ల రూపాయలు వచ్చిందని తెలిపారు.
Next Story

