Tue Mar 17 2026 15:48:00 GMT+0530 (India Standard Time)
తిరుమలలో రద్దీ ఈరోజు ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్ తో సంబంధం లేకుండా భక్తులు తిరుమలకు వస్తున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్ తో సంబంధం లేకుండా భక్తులు తిరుమలకు వస్తున్నారు. ప్రధానంగా తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల రాక పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈరోజు వైకుంఠం కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వీరు శ్రీవారిని దర్శించుకునేందుకు 36 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
36 గంటలు...
ఇప్పుడు సర్వదర్శనం క్యూలైన్ లో ప్రవేశించే వారికి నలభై గంటలకు పైగానే సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి నాలుగు నుంచి ఐదు గంటల దర్శనం సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 69,814 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,228 భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి ఆదాయం 4.17 కోట్ల రూపాయలు వచ్చిందని తెలిపారు.
Next Story

