Tue Mar 17 2026 11:57:19 GMT+0530 (India Standard Time)
దర్శనం 24 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు కోసం వేచి ఉన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు స్వామి దర్శనం 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇప్పుడు క్యూ లైన్ లోకి ప్రవేశించే భక్తులకు మాత్రం అదనంగా మరో నాలుగు గంటల సమయం పట్టే అవకాశముంది.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ కొనుగోలు చేసిన వారికి స్వామి వారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 51,376 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వారిలో 24,878 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.60 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

