Mon Mar 16 2026 20:03:55 GMT+0530 (India Standard Time)
నేడు కూడా 24 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 19 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి దర్శన సమయం ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సర్వదర్శనం క్యూలైన్లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
శీఘ్రదర్శనం...
మూడు వందల రూపాయల టిక్కెట్లు కొనుగోలు చేసి శీఘ్రదర్శనం క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 73,208 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,642 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.12 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

