Mon Dec 09 2024 08:02:56 GMT+0000 (Coordinated Universal Time)
రష్.. బాగా పెరిగిందిగా
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులు అధిక సంఖ్యలోనే తిరుమలకు చేరుకుంటున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులు అధిక సంఖ్యలోనే తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రధానంగా తమిళనాడు నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మరింత రద్దీ పెరుగుతుందని భావించి ముందుగానే శ్రీవారిని దర్శించుకుందామని భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమల భక్తులతో కిటకిటలాడిపోతుంది. క్యూ లైన్లు కూడా నిండిపోతున్నాయి.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 72,230 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీరిలో 27,388 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.74 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తెలిపారు.
Next Story