Mon Mar 16 2026 06:03:07 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమల తిరుపతి వెంకటేశా.. కనిపించవేమయ్యా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తులు తిరుమలలో అధిక సంఖ్యలోనే ఉన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తులు తిరుమలలో అధిక సంఖ్యలోనే ఉన్నారు. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వసతి గృహాలు కూడా దొరకడం కష్టంగా మారింది. రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో రద్దీ ఒక్కసారిగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
కంపార్ట్మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 78,064 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,869 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.70 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

