Mon Mar 16 2026 23:22:02 GMT+0530 (India Standard Time)
శ్రీవారి దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తులు తిరుమలలో అధిక సంఖ్యలో ఉన్నారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తులు తిరుమలలో అధిక సంఖ్యలో ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఇప్పటికే ఉన్న భక్తులకు ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఉదయం ఏడు గంటల తర్వాత సర్వదర్శనం టోకెన్లు లేకుండా క్యూలైన్ లో ప్రవేశించే వారికి శ్రీవారి దర్శనం పథ్నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,613 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,306 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.14 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

