Mon Mar 16 2026 20:03:59 GMT+0530 (India Standard Time)
శ్రీరామనవమితో తిరుమలలో రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీరామనవమి సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా కనిపిస్తుంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీరామనవమి సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఉదయం ఏడు గంటలకు సర్వదర్శనం క్యూ లైన్లోకి ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పదహారు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్వనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 64,574 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 24,244 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.76 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

