Tue Mar 17 2026 11:53:40 GMT+0530 (India Standard Time)
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగానే ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరు స్వామి వారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇప్పుడు క్యూ లైన్ లలో ప్రవేశించే భక్తులకు ముప్ఫయి గంటల సయమం పట్టే అవకాశముందని తెలిపారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,931 భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,813 భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.48 కోట్ల రూపాయలుగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Next Story

