Tue Mar 24 2026 05:30:14 GMT+0530 (India Standard Time)
తిరుమలలో మళ్లీ పెరిగిన రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వైకుఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వీరు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరికి స్వామి వారి దర్శనం 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. అదే సమయంలో ఇప్పుడు సర్వదర్శనం క్యూ లైన్ లోకి ప్రవేశించే వారికి అదనంగా మరో ఐదు గంటల సమయం పట్టే అవకాశముందని చెబుతున్నారు.
శనివారం కావడంతో...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 60,157 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,445 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు కోట్ల రూపాయలు వచ్చిందని తెలిపారు.
Next Story

