Sat Dec 20 2025 00:24:52 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 9 కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్నారు. వీరికి శ్రీవారి దర్శనం అయ్యేందుకు పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కొనుగోలు చేసిన భక్తులకు దర్శనానికి రెండు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 67,525 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,484 భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.24 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Next Story

