Mon Mar 16 2026 21:48:34 GMT+0530 (India Standard Time)
దర్శన సమయం 24 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 18 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శ్రీవారి దర్శనానికి సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సర్వదర్శనం టోకెన్లు లేకుండా ఉదయం ఏడు గంటలకు క్యూ లైన్ లోకి ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం 24గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల శీఘ్రదర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయంలో దర్శనం పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 62,938 భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,751 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.24 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
Next Story

