Wed Mar 18 2026 00:03:40 GMT+0530 (India Standard Time)
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 18 కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్నారు. ఈరోజు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. 300 రూపాయలు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల దర్శన సమయం పడుతుంది.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 80,312 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,538 భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.14 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Next Story

