Tue Mar 17 2026 17:32:54 GMT+0530 (India Standard Time)
శ్రీవారి దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట శిలా తోరణం వరకూ క్యూ లైన్ కొనసాగుతుంది. ప్రస్తుతం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు స్వామి వారి దర్శనం 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు క్యూ లైన్ లోకి వస్తే మాత్రం అదనంగా మరో నాలుగు గంటల సమయం పడుతుందని తెలిపారు.
హుండీ ఆదాయం....
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 84,878 భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 41,016 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.86 కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story

