Tue Mar 17 2026 11:52:59 GMT+0530 (India Standard Time)
అమ్మో.. అంత పెద్ద క్యూ లైనా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లలన్నీ భక్తులతో నిండిపోయాయి

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లలన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి ఎంబీసీ వరకూ భక్తులతో నిండిపోయి ఉంది. స్వామి వారి దర్శనానికి 36 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. ఇప్పుడు సర్వదర్శనం క్యూ లైన్ లో ప్రవేశించే వారికి అదనంగా మరో నాలుగు గంటల సమయం పడుతుందని తెలిపారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 54,609 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,718 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.39 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

