Tue Mar 17 2026 13:49:34 GMT+0530 (India Standard Time)
తిరుమలలో దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ టీబీసీ వరకూ విస్తరించి ఉంది. వీరికి స్వామి వారి దర్శనం జరగాలంటే కనీసం 30 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇప్పుడు సర్వదర్శనం క్యూలైన్ లోకి వచ్చే భక్తులకు అదనంగా మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు.
30 గంటలకు పైగానే...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల పాటు దర్శన సమయం పట్టే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధకారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 73,831 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు 34,443 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.02 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

