Tue Mar 17 2026 15:48:00 GMT+0530 (India Standard Time)
బుధవారం.. తిరుమలలో రష్ ఇలా
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు శ్రీవారి దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు క్యూలైన్ లోె ప్రవేశించే వారికి మరో నాలుగు గంటల అదనపు సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల దర్శన సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 72,176 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,549 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.12 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

