Mon Mar 16 2026 04:25:54 GMT+0530 (India Standard Time)
Tirumala : నేడు తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలలో వేచి ఉన్నారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలలో వేచి ఉన్నారు. పరీక్షలు పూర్తి కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తెలిపారు. ముందుగా బుక్ చేసుకున్న భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.
24 గంటల పాటు...
నిన్న తిరుమలకు 81,224 మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 24,093 మంది భక్తులు తలనీలలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.35 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది.
Next Story

