Mon Mar 16 2026 20:03:54 GMT+0530 (India Standard Time)
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పదకొండు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి దర్శన సమయం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం క్యూ లైన్లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు సర్వదర్శనం టోకెన్లు లేకుండా క్యూ లైన్లో ప్రవేశించిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 70,497 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 26,987 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.56 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

