Tue Mar 17 2026 01:07:04 GMT+0530 (India Standard Time)
దర్శనానికి 24 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం కూడా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం కూడా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు ఐదు గంటల దర్శన సమయం పడుతుంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతుందని తిరుమల దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం....
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 70,789 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,215 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
- Tags
- rush
Next Story

