Tue Mar 17 2026 02:34:52 GMT+0530 (India Standard Time)
శ్రీవారి దర్శనానికి సమయం?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పదిహేను కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి దర్శన సమయం ఐదు గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి పథ్నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల శీఘ్రదర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 80,969 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,777 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

