Tue Mar 17 2026 09:59:22 GMT+0530 (India Standard Time)
శుక్రవారం.. తిరుమలలో రద్దీ ఇలా
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 14 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు దర్శన సమయం 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇప్పటికిప్పుడు క్యూ లైన్ లో ప్రవేశించే వారికి అదనంగా మరో నాలుగు గంటల సమయం పడుతుందని తెలిపారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి గంటల వరకూ దర్శన సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,549 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,919 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

