Tue Mar 17 2026 07:51:00 GMT+0530 (India Standard Time)
కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 62,856 మంది భక్తులు దర్శించుకున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 62,856 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,115 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.21 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఉత్తర ద్వార దర్శనం నుంచి భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
రేపు ప్రత్యేక దర్శనం...
కాగా రేపు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. జనవరి 12 నుంచి 31వ తేదీ వరకూ, ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆన్ లైన్ లో భక్తులు శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం అధకారులు తెలిపారు.
Next Story

