Sat Dec 13 2025 19:29:54 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు నేడు వచ్చే భక్తులు ఎన్ని గంటల వేచి ఉండాలంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తులు శ్రీవారి దర్శనం చేసుకోవడానికి గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. గత కొన్నాళ్లుగా తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం ప్రారంభమయిన రద్దీ శనివారం, ఆదివారం, సోమవారంతో పాటు మంగళవారం కూడా కొనసాగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.
భక్తులకు ఇబ్బంది పడకుండా...
తిరుమలలో వచ్చే నెల చివరి నుంచి వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది. ఈ సారి ఆన్ లైన్ లోనే టిక్కెట్లను విడుదల చేయాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. రోజుకు ఎనిమిది లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించింది. వీటితో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా అనుమతించబోమని, సామాన్య భక్తులకు మాత్రమే ప్రాధాన్యత దక్కేలా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించింది. సిఫార్సు లేఖలు వంటివి కూడా పది రోజుల పాటు స్వీకరించే అవకాశం లేదు.
ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు నేడు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 68,615 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,722 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

