Fri Dec 05 2025 11:41:13 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు వెళ్లే వారు ఈ కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనట
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. అలిపిరి టోల్ గేట్ నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వాహనాలు అధిక సంఖ్యలో ఘాట్ రోడ్డు లో కనిపిస్తున్నాయి. తిరుమలలోనూ వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. గత నాలుగున్నర నెలల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. మే 15వ తేదీన ప్రారంభమైన తిరుమలలో భక్తుల రద్దీ నేటికీ కొనసాగుతుందని, తమిళనాడులో పెరటాసి మాసం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
కొనసాగుతున్న రద్దీ...
తిరుమలకు భక్తులు ఒక్కసారిగా పెరగడంతో టీటీడీ అధికారులు ముంందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎస్.ఎస్.డి. టోకెన్లు రోజు వారీ జారీ చేయడంతో పాటు కాలినడకన వచ్చే భక్తులు, ముందుగా మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకున్న వారితో తిరుమల వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి. వసతి గృహాల కౌంటర్ వద్ద కూడా అధికంగా రద్దీ ఉంది. వసతి గృహం దొరకడానికి గంటల సమయం వేచి చూడాల్సి ఉంది. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలను, మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇరవై నాలుగు గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయారు. బయట శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఈరోజు తిరుమలోని సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించని భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటలకు పైగానే పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 74,861 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,802 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

