Fri Dec 05 2025 14:59:10 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో ఎంత పెద్ద క్యూలైన్ అంటే.. దర్శనానికి సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ ఏడాది మే 15వ తేదీ నుంచి ఈ రద్దీ మొదలయిందని టీటీడీ అధికారులు తెలిపారు. అప్పటి వరకూ సిఫార్సు లేఖలను రద్దు చేయడంతో రద్దీ తగ్గిందని, సిఫార్సు లేఖలను తిరిగి తీసుకోవడం ప్రారంభించిన తర్వాత తిరుమలలో భక్తుల తాకిడి మొదలయిందని అధికారులు అంటున్నారు. ఇక రానున్న కాలంలో తిరుమలకు మరింతగా భక్తుల తరలి వచ్చే అవకాశముందని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
డిసెంబరు కోటాకు సంబంధించి...
ఈరోజు డిసెంబరు కోటాకు సంబంధించిన టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది.ఈరోజు నుంచి ఇరైవై నాలుగో తేదీ వరకూ ఆన్ లైన్ టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు లక్కీడీప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలు, అంగప్రదిక్షిణ టిక్కెట్లను విడుదల చేయనుంది. దీంతో ఈ టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు పోనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్ సైట్ లోనే టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరో్జు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ క్యూ లైన్ విస్తరించింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,410 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.86 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

