Sat Dec 06 2025 00:06:24 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో మళ్లీ పెరుగుతున్న భక్తుల రద్దీ.. ఇక తగ్గదట.. రీజన్ ఇదే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. భక్తుల రద్దీ కొనసాగుతుంది. చంద్రగ్రహణం రోజున కొంత తగ్గినట్లు కనిపించినా తిరిగి భక్తుల రద్దీ ప్రారంభమయింది. అలిపిరి టోల్ గేట్ నుంచి వాహనాలు అధిక సంఖ్యలో తిరుమల కొండకు చేరుకుంటున్నాయి. ఎక్కువగా ప్రయివేటు వాహనాల్లో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. అయితే భక్తులు ఎంత మంది వచ్చినా వారికి సులువుగా దర్శనం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు.
ఎంత మంది వచ్చినా...
దైవ దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని, భక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు వసతి గృహాల విషయంలోనే కొంత కొరత ఏర్పడుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. గత మూడున్నర నెల నుంచి తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. రోజూ కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్లు ఉంటున్నాయి. అయితే క్యూ లైన్లలో గంటల సేపు వేచి ఉండే భక్తులకు స్వామి వారి అన్నప్రసాదం, మజ్జిగ, పాలు వంటి వాటిని శ్రీవారి సేవకులు నిరంతరం పంపిణీ చేస్తున్నారని, ఇందుకోసం పన్నెండు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇరవై రెండు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించి వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను నుంచి పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,086 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,239 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.56 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

