Fri Dec 05 2025 15:58:38 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేటి మధ్యాహ్నం ఒంటి గంట వరకే భక్తులకు దర్శనానికి అనుమతి
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం నుంచి ఆలయం మూసివేస్తుండటంతో భక్తులు రాత్రి నుంచి స్వామి వారి దర్శనానికి బారులు తీరారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం నుంచి ఆలయం మూసివేస్తుండటంతో భక్తులు రాత్రి నుంచి స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అయితే క్యూలైన్లను రెండు గంటల తర్వాత మూసివేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందే ప్రకటించారు. అయినా భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ప్రస్తుతం ఉన్న భక్తులను వేగంగా స్వామి వారి దర్శనానికి ఆలయం ద్వారాలు మూసివేంత వరకు అనుమతిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
చంద్రగ్రహణం సందర్భంగా...
చంద్రగ్రహణం సందర్భంగా దాదాపు పన్నెండు గంటల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం మూసివేయనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఆలయ ద్వారాలు మూసివేస్తారు. తర్వాత ఆలయ సంప్రోక్షణ తర్వాత మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. రేపు మధ్యాహ్నం నుంచి దర్శనానికి అనుమతించనున్నారు. దాదాపు పదహారు గంటల పాటు స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. అప్పటి వరకూ వసతి గృహాల్లోనే భక్తులు వేచి ఉండాలని సూచించారు. అన్న ప్రసాదాలను, లడ్డూ తయారీలను కూడా చంద్ర గ్రహణం సంందర్భంగా బంద్ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న భక్తులను మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. తర్వాత ఎవరినీ అనుమతించరు. నిన్న తిరుమల శ్రీవారిని 82,118 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 32,118 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.97 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశముంది కాబట్టి భక్తులు తమకు కేటాయించిన వసతి గృహాల్లోనే ఉండాలని అధికారులు సూచించారు.
Next Story

