Fri Dec 05 2025 23:47:45 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమలకు వెళుతున్నారా? అయితే మీకొక న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. అయితే నేడు శుక్రవారం కావడంతో రద్దీ కొంత పెరిగింది. మధ్యాహ్నానికి భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా శుక్ర, శని, ఆదివారాలు తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
సీజన్ తో సంబంధం లేకుండా...
తిరుమలకు ఒకప్పుడు సీజన్ లో మాత్రమే రద్దీ ఉండేది. అదే వేసవి కాలంలో ఎక్కువ రద్దీ ఉండేది. కానీ రాను రాను ప్రయాణానికి సంబంధించిన అనువైన వీలు ఏర్పాటు కావడంతో పాటు రోడ్డు, రైలు, వాయు మార్గాల నుంచి వెళ్లడానికి సులువు కావడంతో వారంతోనూ, సీజన్ తోనూ సంబంధం లేకుండా తిరుమలకు భక్తులు చేరుకుంటున్నారు. అందుకే తిరుమల నిత్యం భక్తులతో రద్దీగానే ఉంటుంది. తిరుమలలో ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు అప్పటికప్పుడు వచ్చిన వారు కూడా స్వామి వారిని దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తెలిపారు.
పదిహేను కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదిహేను కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 63,843 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,344 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నరు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.49 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

