Fri Dec 05 2025 13:17:06 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శుక్రవారం తిరుమలలో భక్తుల సంఖ్య ఎలా ఉందో తెలిస్తే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. అయితే శ్రావణ శుక్రవారం కావడంతో గతంలో కంటే భక్తుల దర్దీ కొంత మేరకు తగ్గింది. అయితే దర్శనానికి మాత్రం గంటల సమయం పడుతుంది. హుండీ ఆదాయం మాత్రం ఘనంగా వస్తుంది. జులై నెలలో కూడా దాదాపు 120 కోట్ల రూపాయల మేరకు హుండీ ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
వసతి గృహాల కోసం...
తిరుమలలో వసతి గృహాలు దొరకడం కష్టంగా ఉంది. అందుకే శ్రీవాణి టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు ఈరోజు నుంచి పదిహేనో తేదీ వరకూ సాయంత్రం నాలుగున్నర గంటలకు దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. దీనివల్ల దర్శనం పూర్తయిన వెంటనే వారు వసతి గృహాలు ఖాళీ చేసి వెళతారని భావిస్తున్నారు. సాధారణంగా శ్రీవాణి టిక్కెట్ల కోసం రెండు రోజుల పాటు వెయిట్ చేయాల్సి రావడంతో వసతి గృహాలను తీసుకున్న వారు రెండు రోజులు ఉంచుకుంటుండటంతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇరవై ఆరు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తుల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 66,149 మంది భక్తుుల దర్శించుకున్నారు. వీరిలో 24,429మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.66 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

