Fri Dec 05 2025 14:59:11 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా? అయితే దర్శనం కోసం ఎంత సమయం వెయిట్ చేయాలంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ ఇటీవల కాలంలో ఎక్కువ కావడంతో పాటు అన్ని పుణ్యక్షేత్రాల సందర్శన ఎక్కువయింది. తమిళనాడులోని దేవాలయాలను సందర్శించేందుకు వచ్చిన ఇతర రాష్ట్రాల భక్తులు దారి మధ్యలో ఉన్న తిరుమలకు చేరుకుని ఏడుకొండలవాడిని దర్శించుకుని తమ మొక్కుల చెల్లించుకుంటున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
జులై నెలలో...
తిరుమలకు సాధారణంగా వర్షాకాలం భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. జులై నెలలో వర్షాలు ఎక్కువగా ఉండటంతో పాటు అల్పపీడనాలు, వాయుగుండం ప్రభావంతో తిరుమలకు భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది జులై నెలలో మాత్రం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. అనేక కారణాలతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గత రెండున్నర నెలల నుంచి పెరిగిందని, పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
ఇరవై ఆరు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించి వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 85,740 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదదాయం 3.41j కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

