Fri Dec 05 2025 14:59:01 GMT+0000 (Coordinated Universal Time)
Tiruamala : తిరుమలకు ఈరోజు వెళ్లే వారికి అలెర్ట్ .. ఎన్ని గంటలు వెయిట్ చేయాలో తెలుసా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. శుక్ర, శని, ఆదివారాలు భక్తుల రద్దీ అధికంగానే ఉంటుంది. అలాగే గత రెండున్నర నెలల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్లు విస్తరించి ఉన్నాయి. మే 15వ తేదీన సిఫార్సు లేఖలను తిరిగి ప్రారంభించిన తర్వాత నుంచి భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అయితే భక్తుల సంఖ్య ఎంత పెరిగినా సామాన్యులకు స్వామి దర్శనం సులువుగా అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
టోల్ గేట్ నుంచి...
అలిపిరి టోల్ గేట్ నుంచి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. వాహనాలను తనిఖీ చేసే సమయమే గంటలకు పైగా పడుతుంది. ఇక తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో కూడా వాహనాల రద్దీ పెరిగింది. వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. ఇక కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఎస్ఎస్.డి. టోకెన్లు తీసుకున్న భక్తులు కూడా స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు తరలి రావడంతోతిరుమల భక్తులతో కిటకిటాలాడిపోతుంది. క్యూలైన్ లో ఉన్నవారికి శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనానికి ఏడు గంటలకుపైగా నే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 92,221 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 42,280 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.51 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

