Fri Dec 05 2025 14:58:58 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా? అయితే దర్శనం కోసం?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. భక్తుల సంఖ్య గత రెండు నెలలకు పై నుంచి ఎక్కువగా వస్తుంది. మే 15వ తేదీ నుంచి ప్రారంభమయిన రద్దీ నేటి వరకూ కొనసాగుతూనే ఉంది. తిరుమలలో స్వామి వారి దర్శనానికి గంటల సమయ పడుతుంది. జులై నెలలో సాధారణంగా భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. అయినా సరే ఈ నెలలో రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సామాన్య భక్తులకు సులువుగా దర్శనం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
సీజన్ తో సంబంధం లేకుండా...
తిరుమలకు ఒకప్పుడు వేసవి రద్దీ మాత్రమే ఉండేది. మిగిలిన రోజుల్లో రద్దీ సాధారణంగానే ఉండేది. స్వామి వారి దర్శనం సులువుగా లభించేది. కానీ గత కొన్నేళ్ల నుంచి సీజన్ తో సంబంధం లేకుండా రద్దీ కొనసాగుతుంది. వేసవిలో అత్యధికంగా రద్దీ ఉంటుందని భావించిన భక్తులు ముందుగాని, తర్వాత కాని టిక్కెట్లను బుక్ చేసుకుని తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలకు నిత్యం భక్త జనం పోటెత్తుతూనే ఉంది. తిరుమల వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి.
21 కంపార్టుమెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 78,320 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,950 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.66 కోట్ల రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Next Story

