Fri Dec 05 2025 14:58:53 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గత నెల పదిహేనో తేదీ నుంచి తిరుమలలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. వేసవి రద్దీ దృష్టిలో ఉంచుకుని జులై 1వ తేదవీ వరకూ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సిఫార్సు లేఖలను కూడా రద్దు చేశారు. అయితే రద్దీ తక్కువగా ఉండటంతో తిరిగి సిఫార్సు లేఖలను తీసుకోవడం ప్రారంభించారు. అప్పటి నుంచి తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. అలిపిరి టోల్ గేట్ నుంచి తిరుమల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది.
సామాన్య భక్తులు...
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రోజుకు లక్షల మంది భక్తులు దేశం నలుమూలల నుంచి తరలి వస్తుంటారు. సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. క్యూ లైన్లు విస్తరించి ఉండంటంతో ఉచితంగా అన్న ప్రసాదాలను కూడా పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా సెలవు దినాల్లో తిరుమలకు భక్తులు పోటెత్తుతారని తెలిసి అధికారులు ప్రత్యేకంగా సామాన్య భక్తులు సులువుగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటును్నారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు దాదాపుగా భక్తులతో నిండిపోయాయి. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారకు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 90,051 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.90 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

