Sat Mar 07 2026 21:55:42 GMT+0530 (India Standard Time)
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
ితిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారమైనా భక్తులు తిరుమలలో అధిక సంఖ్యలో ఉన్నారు

ితిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారమైనా భక్తులు తిరుమలలో అధిక సంఖ్యలో ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయి ఉన్నారు. వీరికి స్వామి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది.
దర్శనానికి...
ఇక నిన్న తిరుమల శ్రీవారిని 75,175 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,979 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి ఆదాయం 4.05 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Next Story

