Sun Mar 15 2026 10:24:39 GMT+0530 (India Standard Time)
శ్రీశైలం వెళ్లే భక్తులకు కీలక అప్ డేట్
శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో స్పర్శ దర్శనం రద్దు చేశారు

శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పెద్దయెత్తున భక్తుల తరలి వచ్చి ఇటు స్వామి వారిని దర్శించుకుని అటు ప్రాజెక్టు అందాలను చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులుతరలి వస్తున్నారు. దీంతో శ్రీశైలం ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
స్పర్శ దర్శనం రద్దు...
మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు కీలక అప్ డేట్ ఇచ్చారు. స్వామి వారి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్లు ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. భక్తుల రద్దీ పెరగడంతో జూలై 15 నుంచి 18 వరకు స్పర్శ దర్శనం రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా మంగళవారం నుంచి శుక్రవారం వరకు రోజూ మధ్యాహ్నం 1.45 నుంచి. 3.34 వరకు ఈ దర్శన అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇందుకు ఒక రోజుముందుగా టికెట్ బుక్ చేసుకోవాల్సిఉంటుందని చెప్పడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Next Story

