Wed Mar 18 2026 07:40:31 GMT+0530 (India Standard Time)
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. నిన్న 79,103 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు

తిరుమలలో రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. నిన్న 79,103 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 37,292 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ లో భక్తులు 4.42 కోట్ల రూపాయలు భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడతుంది.
నేడు టోకెన్ల విడుదల...
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఆన్ లైన్ లో అంగప్రదిక్షణ టోకెన్లను విడుదల చేయనుంది. కరోనాతో రెండు సంవత్సరాలు వీటికి దూరంగా ఉంది. కరోనా కారణంగా అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేయడంతో ఈ సేవ కూడా రద్దయింది. ఈరోజు 750 టోకెన్లను విడుదల చేయనుంది. ఈ నెల 31వ తేదీ వరకూ ఈ టోకెన్లు అమలులో ఉంటాయి.
Next Story

