Tue Mar 17 2026 13:49:34 GMT+0530 (India Standard Time)
దర్శనానికి 40 గంటల సమయం
తిరుమలలో రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది.

తిరుమలలో రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 22 కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు స్వామి వారి దర్శనం నలభై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు సర్వదర్శనం క్యూ లైన్ లోకి వచ్చే వారికి అదనంగా మరింత సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాలయ ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 76,681 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 40,109 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.38 కోట్ల రూపాయలు అని అధికారులు తెలిపారు.
Next Story

