Tue Mar 17 2026 17:32:12 GMT+0530 (India Standard Time)
శనివారం.. తిరుమలలో రష్ ఎంతంటే?
తిరుమలలో రద్దీ పెరిగింది. శనివారం కావడంతో తిరుమలకు భక్తుల రాక మరింత ఎక్కువయింది

తిరుమలలో రద్దీ పెరిగింది. శనివారం కావడంతో తిరుమలకు భక్తుల రాక మరింత ఎక్కువయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శిల్ప తోరణం వరకూ క్యూ లైన్ కొనసాగుతుంది. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు దర్శనం 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు క్యూలైన్ లోకి వచ్చే వారికి మరో నాలుగైదు గంటల అదనంగా సమయం పడుతుందని తెలిపారు.
20 గంటల సమయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం దర్శన సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 63,512 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 35,549 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.72 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Next Story

