Sat Dec 13 2025 22:33:52 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా.. అయితే మీకొక అలెర్ట్
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. కార్తీక మాసం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. కంపార్ట్ మెంట్లలో ఉన్న భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు అవసరమైన మంచినీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.
ఆరు నెలల నుంచి...
తిరుమలకు గత కొంత కాలంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ ఏడాది మే 15వ తేదీ నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. భక్తుల క్యూలైన్ బయట వరకూ దాదాపు అన్ని రోజుల్లో కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి రోజూ టోకెన్లు జారీ చేస్తుండటంతో పాటు కాలినడకన వచ్చే భక్తులు, ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులతో తిరుమల కొండ నిత్యం భక్తులతో కిటకిటలాడుతూనే ఉంది. తిరుమల మాడవీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి.
ఇరవై కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 76,096 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,289 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.01 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

