Tue Jan 20 2026 11:23:52 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. గాయాలపాలయిన ప్రయాణికులు
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయింది. ప్రమాదం సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికు లున్నారు.

ఏలూరు జిల్లాబుట్టాయిగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయింది. ప్రమాదం సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులున్నారు. బుట్టాయిగూడెం మండలం దొరమామిడి నుండి జంగారెడ్డిగూడెం వస్తున్న బస్సు జంగారెడ్డిగూడెం నాలుగు రోడ్లు జంక్షన్ దగ్గర ప్రమాదం జరిగింది. ఏడుగురు ప్రయాణికులకు చిన్నపాటి గాయాలయ్యాయి. పోలీసులు వారిని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ జంక్షన్ ప్రమాదకరం...
జంగారెడ్డి గూడెం జంక్షన్ దగ్గర తరచూ ప్రమాదాలకు గురి అవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎలాంటి ప్రమాదం జరగకుండా భద్రత లేకపోవడమే ప్రధాన కారణమని స్థానికులు స్పీడ్ బ్రేకర్ లు స్టాపర్లు లేకపోవడమే ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణమని అంటున్నారు. అధికారులు మరోసారి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు
Next Story

