ప్రతినిత్యం ఏదొక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రోడ్లు నెత్తురోడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. జిల్లాలోని సింగనమల మండలం సింగనమల నుంచి శోధనపల్లి వస్తున్న ఆర్టీసీ బస్సు.. ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ సహా.. పలువురు ఉపాధ్యాయులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సింగనమల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Sun May 22 2022 19:54:10 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీ బస్సు బోల్తా.. ముగ్గురికి తీవ్రగాయాలు

Next Story