Sun Mar 15 2026 08:54:40 GMT+0530 (India Standard Time)
పరకామణిలో చోరీ
తిరుమలలోని టీటీడీ పరకామణి మండపంలో చోరీ జరిగింది. రవి అనే కాంట్రాక్టు ఉద్యోగి 900 డాలర్లు చోరీ చేసి దొరికిపోయాడు.

తిరుమలలోని టీటీడీ పరకామణి మండపంలో చోరీ జరిగింది. రవి అనే కాంట్రాక్టు ఉద్యోగి తొమ్మిది వందల డాలర్లు చోరీ చేసి దొరికిపోయాడు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని అధికారులు గుర్తించారు. నోట్ల లెక్కింపు జరుగుతుండగా, కొన్ని విదేశీ నోట్లను నిందితుడు మల ద్వారం వద్ద ఉంచుకుని వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయింది.
గుర్తించిన అధికారులు...
దీంతో విజిలెన్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పరకామణిలో ఇంత నిఘా ఉన్నప్పటికీ చోరీకి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.
Next Story

