Mon Dec 15 2025 07:27:11 GMT+0000 (Coordinated Universal Time)
మంగళగిరి వాసులకు గుడ్ న్యూస్
మంగళగిరి – తెనాలి – నారా కోడూరు మధ్య రోడ్లు కొత్త రూపు సంతరించుకోనున్నాయి

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంగళగిరి – తెనాలి – నారా కోడూరు మధ్య రోడ్లు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. ఇప్పటికే గుంటూరు జిల్లాలో కీలక రోడ్లు, ప్రజలు నిత్యం రాకపోకలు అధికంగా సాగించే మార్గాలైన తెనాలి - గుంటూరు వయా నారా కోడూరు, తెనాలి - విజయవాడ వయా మంగళగిరి రహదారుల విస్తరణకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.. తెనాలి నుంచి గుంటూరు మార్గంలో నారా కోడూరు వరకు, తెనాలి - విజయవాడ మార్గంలో మంగళగిరి హైవే వరకు 4 లైన్లుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో అధికారులు డీపీఆర్ రూపకల్పన పనులు ప్రారంభించారు.
డీపీఆర్ రెడీ...
మంగళగిరి - తెనాలి- నారా కోడూరు మధ్య 40.05 కి.మీ రహదారులను నాలుగు వరుసలకు విస్తరణ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ పనులను శుక్రవారం ప్రారంభించడం జరిగింది. ఇందు కోసం ప్రభుత్వం1.12 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీనితో అధికారులు, ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి డీపీఆర్ నివేదిక సిద్ధం చేస్తున్నారు. విస్తరణకు అవసరమైన కొలతలు సేకరిస్తున్నారు. దీంతో మంగళగిరి - తెనాలి - నారా కోడూరు మధ్య రోడ్లకు మహర్దశ పట్టనుంది.
Next Story

