Fri Dec 05 2025 14:01:01 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా చాకిచెర్ల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా చాకిచెర్ల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. వ్యాన్ ను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇద్దరి పరిస్థితి విషమం...
గాయాలయిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పిడుగురాళ్ల నుంచి తిరుమలకు దర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతివేగంగా వచ్చి వ్యాన్ ను లారీ ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

