Fri Apr 03 2026 11:04:16 GMT+0530 (India Standard Time)
Road Accident : ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు మరణించారు

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు మరణించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. బైకుపై వెళుతున్న ఐదుగురిని లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బైకుపై ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగురు మైనర్లు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.
ఇద్దరు మృతి...
ఐదుగురిలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలయిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులను నక్కా ఈశ్వర్, మోదుగు సన్నీలుగా తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Next Story

