Fri Dec 12 2025 03:16:02 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి పది మందికి పైగా మృతి
అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు ఎనిమిది మంది మరణించారు.

అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు ఎనిమిది మంది మరణించారు. ఒక ప్రయివేటు బస్సు అదుపు తప్పి లోయలోపడింది. అల్లూరు సీతారామరాజు జిల్ల చింతూరు - మారేడుమిల్లి ఘాటు రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. రాజుగారి మెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులున్నారు. ఇద్దరు డ్రైవర్లున్నారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే చింతూరు పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో పది నుంచి పదిహేను మంది మరణించినట్లు సమాచారం అందుతుంది.
మృతుల సంఖ్య మరింతగా...
గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదుపు తప్పి బస్సు లోయలో పడింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదం జరిగిందని కొందరు చెబుతున్నారు. అయితే డ్రైవర్ నిద్రమత్తు, నిర్లక్ష్యం కారణంగా కూడా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. ప్రమాదానికి గురైన బస్సు ప్రయివేటు ట్రావెల్స్ కు చెందిన బస్సుగా గుర్తించారు. బస్సులో లోయలో పడిన వెంటనే ప్రయాణికులు పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి సమాచారం పోలీసులకు అందించారు.
చిత్తూరు జిల్లాకు...
చిత్తూరు జిల్లాకు చెందిన ప్రయివేటు ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులున్నారని తెలిసింది. ఆలయాల సందర్శనతో పాటు అరకును కూడా సందర్శించాలని వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డు దిగుతుండగా అదుపు తప్పి లోయలో పడిందని చెబుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఆ రహదారిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఘటన స్థలం వద్ద మృతుల బంధువులు రోదిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

