Mon Mar 16 2026 00:50:59 GMT+0530 (India Standard Time)
Rk Roja : రుషికొండ భవనంపై రోజా రెస్పాన్స్.. బెంజి కారంటూ టీడీపీ ఎమ్మెల్యే బౌన్సర్
రుషికొండలో నిర్మించిన భవనపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోనే నిర్మించామన్నారు

రుషికొండలో నిర్మించిన భవనపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల అనుమతులతోనే ఆ భవనాన్ని నిర్మించామని ఆర్కే రోజా గుర్తు చేశారు. ఆ భవనం నిర్మాణం అత్యద్భుతంగా జరిగిందని ఆమె ట్వీట్ చేశారు. విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ భవనాన్ని నిర్మించడం తప్పా అని రోజా ప్రశ్నించారు. రుషికొండ భవనాన్ని చూసి ఓర్వలేని కొందరు ఆ భవన నిర్మాణాలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
బెంజికారు కథేంటంటూ...
వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయం నిర్మించిన వారికి ఈ భవనం చూసి కళ్లు కుడుతున్నాయని ఆమె అన్నారు. ఈ భవనాల నిర్మాణాలకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులిచ్చిందని చెప్పారు. మరోవైపు నగరి టీడీపీ ఎమ్మెల్యే భానుప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. రోజా బెంజ్ కారు సంగతి కూడా చెప్పాల్సిందని తెలిపారు. ఈ భవనానికి, బెంజ్ కారుకు ఉన్న లింకేమిటంటూ ఆయన ప్రశ్నించి మాజీ మంత్రి ఆర్కే రోజాకు కౌంటర్ ఇచ్చారు.
Next Story

